Thursday, January 23, 2025

మనిషి ఆరంభం, అంతం ‘పిండం’తోనే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం’. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘పిండం’ టీజర్ విడుదల కార్యక్రమం సందర్భంగా హీరో శ్రీకాంత్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘రెండే నెలల్లో ఈ సినిమా పూర్తయింది. ఇంత మంచి నిర్మాతలను నా జీవితంలో చూడలేదు.

మా డైరెక్టర్ సాయి కిరణ్ చాలా క్లారిటీ ఉన్న మనిషి. ఇలాంటి మంచి సినిమాని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’అని అన్నారు. చిత్ర దర్శకుడు సాయి కిరణ్ మాట్లాడుతూ, ‘పిండం అనేది నెగటివ్ టైటిల్ కాదు. మనిషి ఆరంభం, అంతం రెండూ దానితో ముడిపడి ఉంటాయి. ఈ సినిమా చాలా బాగా వచ్చింది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోన వెంకట్, బీవీఎస్ రవి, అవసరాల శ్రీనివాస్, హీరోయిన్ ఖుషీ రవి, చిత్ర నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News