Sunday, January 19, 2025

మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు సాధికారతతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తామని స్పష్టం చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సుధా రెడ్డి ఫౌండేషన్ నేతృత్వంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ‘పింక్ పవర్ రన్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిఎసి చైర్మన్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, తదితరలు కలిసి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.  ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలమని, సమాజ శ్రేయస్సుకు అదే పునాది అని ప్రశంసించారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని, సంబంధిత వ్యవస్థలను బలోపేతం చేస్తామని రేవంత్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News