- నేడు ఢిల్లీ వసంత్ బిఆర్‌ఎస్‌లో చేరిక
- ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు, హాజరుకానున్న మహరాష్ట్ర నేతలు, గోరేటి వెంకన్న
జహీరాబాద్: జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన సామాజిక ఉద్యమకారులు ఢిల్లీ వసంత్ నేడు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా పట్టణంలోని యన్ కన్వెన్షన్ హాల్‌లో ఈ సభకు పూర్తి ఏర్పాట్లు చేశామని బృ ందం సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన బృంద సభ్యులు పట్టణ పురవీధులన్ని గులాబీమయంగా మార్చేశారు. మహారాష్ట్ర నేతలు పూణేలోని యంఐటి స్కూల్ అదినేత రాహుల్ విశ్వనాథ్ కరాడ్, మహరాష్ట్ర రైతు నేత బిఆర్‌ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే శంకర్ అన్న దొంగ్డేతో పాటు తె లంగాణ ప్రముఖ కవి, గాయకులు, సాహితి వేత్త అయిన ప్రస్తుత ఎమ్మెల్యే గోరేటి వెంకన్నలు హాజరు కానున్నారు.
ఢిల్లీ వసంత్ బిఆర్‌ఎస్‌లో చేరికను స్వాగతిస్తూ ఆయనకు సంఘీభావం తెలుపుతూ కోహిర్ మండలం గురుజువాడ గ్రామానికి చెందిన కొంతమంది యువకులు తమ గ్రామం నుంచి పాదయాత్రగా డిల్లీ వసంత్‌కు సంఘీభావం తెలిపారు. ఈ కాలినడకలో శ్రీనివాస్, విష్ణువర్దన్, సాగర్, బ్యాగరి శ్రీనివాస్, కర్ణె చిన్న, జె. సుదీర్, బి. చింటు, మహేష్, మ్యాతరి చింటు, బి. శ్రీరాం తదితరులున్నారు.
జహీరాబాద్ కుటుంబ సభ్యుల్లారా దీవించండి
ఈ సందర్భంగా ఢిల్లీ వసంత్ బీఆర్‌ఎస్‌లో చేరుతున్నందున నన్ను దీవించాలని ప్రత్యేకంగా విన్నపించారు. తన 20 రెండు సంవత్సరాల సామాజిక జీవితంలో జహీరాబాద్ గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు కృషి చేసిన విషయాన్ని గుర్తించాలని కోరారు. తనతోపాటు నియోజకవర్గంలోని దాదాపు 60 మంది అనుచరులతో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.