Saturday, June 29, 2024

వైసిపి మాజీ ఎంఎల్‌ఎ పిన్నెల్లి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఈవీఎం ధ్వంసం, ఎన్నికల అల్లర్ల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టి వేయడంతో పోలీసులు వెంటనే ఆయనను నరసారావుపేటలో అదుపులోకి తీసుకుని పల్నాడు జిల్లా ఎస్‌పి కార్యాలయానికి తరలించారు.

ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారికి శిక్ష తప్పదు : ఈసీఐ
ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పించే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇందుకు మాచర్ల మాజీ శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే నిదర్శమని తెలిపింది. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనకు సంబందించి ముందస్తు బెయిల్ పిటిషన్ను నేడు ఏపీ హైకోర్టు కొట్టి వేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు చేసిన సందర్బంగా భారత ఎన్నికల సంఘం స్పందించింది. రాజ్యాంగ బద్దంగా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఇంక ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈవీఎం డ్యామేజ్‌కు కారణమైన ఎమ్మెల్యేను అరెస్టు చేయడంతో ఈసీఐ ఆదర్శప్రాయమైన చర్యకు తార్కిక ముగింపు లభించింది. హోదాతో సంబంధం లేకుండా ఎవరూ చట్టానికి అతీతులు కాదనే సూత్రాన్ని ఇది బలపరుస్తుంది. ఈసిఐ ఎన్నికల ప్రక్రియను పరిరక్షించడానికి కట్టుబడి ఉంది మరియు ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవటం ఎంతో ఆవశ్యకం.

ఈవీఎంలను డ్యామేజ్ చేసిన వారిని అరెస్టు చేయడం అనేది ఎన్నికల సమగ్రతను కాపాడుకోవడంలో ఈసిఐ యొక్క అంకితభావానికి ఒక నిర్దిష్ట ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ లో మే 13 వ తేదీన జరిగిన ఎన్నికల సందర్బంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని రెంటచింతల మండలోని పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ నెం.202 లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే పి.రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనను భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. శాసనసభలో సిట్టింగ్ సభ్యుడు (ఎమ్మెల్యే) ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) ధ్వంసం చేయడం నేరపూరిత చర్యగా మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య ప్రక్రియపై జరిగిన ఘోరమైన దాడిగా కూడా ఈసిఐ పరిగణించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛాయుతమైన మరియు న్యాయమైన ఎన్నికలను నిర్వహించడానికి ఈవీఎంలు మూల స్తంభాలు. అటువంటి ఈవీఎంలను పాడు చేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ యొక్క సమగ్రత దెబ్బతింటుంది, ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది మరియు ఎన్నికల ఫలితాల చట్టబద్ధతపై సందేహాన్ని కలిగిస్తుంది.

దేశంలో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించాల్సిన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణించింది మరియు ఆదర్శప్రాయమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీడియో ఫుటేజ్ లను పరిశీలించిన తర్వాత, ఎమ్మెల్యేను తక్షణమే అరెస్టు చేయాలని మే 21న ఈసీఐ ఆదేశించింది. ఈ సందర్బంగా మాచర్ల మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే పై పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదైన ఈ కేసు నుండి తప్పించుకునేందుకు నిందితులు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషనను దాఖలు చేయడం జరిగింది. ఏపీ హైకోర్టు ఆ బెయిల్ పిటిషన్ ను కొట్టివేయంతో ఈవీఎంల ధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News