Saturday, December 21, 2024

పైప్‌లైన్ పనులను తక్షణమే పూర్తి చేయాలి : మాధవరం

- Advertisement -
- Advertisement -

కూకట్‌పల్లి : నియోజకవర్గంలోని డివిజన్లలో కొనసాగుతున్న మంచినీటి పైప్‌లైన్ పనులను తక్షణమే పూర్తి చేసి ప్రజల అందుబాటులోకి తీసుకురావాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వివిధ విభాగాల అధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల సహకారంతో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి కొనసాగుతుందన్నారు.

జలమండలి, జిహెచ్‌ఎంసి ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో ప్రారంభించిన పనులు ప్రజలకు ఇబ్బందులు పెట్టకుండా సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా తక్షణమే గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన కూకట్‌పల్లి నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యమని కృష్ణారావు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో అధికారులతో పాటుగా డివిజన్ల కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News