Monday, December 23, 2024

పదోన్నతి పొందిన 141 మంది డిఎస్పీలకు పైపింగ్ కార్యక్రమం

- Advertisement -
- Advertisement -
అభినందించిన డిజిపి అంజనీ కుమార్

హైదరాబాద్ : తెలంగాణ అవతారణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని పదోన్నతి పొందిన 141 మంది డిఎస్పీలను డిజిపి అంజనీ కుమార్ సోమవారం అభినందించారు. ఈ పదోన్నతి పొందిన 141 మంది పోలీస్ అధికారులకు సోమవారం డిజిపి ఆధ్వర్యంలో పైపింగ్ వేడుకలు నిర్వహించారు. ప్రమోషన్ ప్రక్రియలో ఈ పైపింగ్ వేడుక ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం కొత్తగా పదోన్నతి పొందిన అధికారులకు అధికారం, బాధ్యతల బదిలీని జరుగుతుంది. ఈ పైపింగ్ వేడుకకు సీనియర్ పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ ఎడిజి సంజయ్ జైన్, సిఐడి ఎడిజి మహేష్ ఎం భగవత్, కోఆర్డినేషన్ ఎడిజి అభిలాషా భిస్ట్, మల్టీజోన్ ఐజిపి షానవాజ్ ఖాసీం, ఐజిపి (శిక్షణ) తరుణ్ జోషి తది తరులు హాజరయ్యారు. సీనియర్ అధికారుల సమక్షంలో జరిగిన ఈ పైపింగ్ వేడుక పదోన్నతి పొందిన అధికారులకు స్ఫూర్తిదాయకంగా నిలు స్తుందని డిజిపి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News