Monday, January 20, 2025

మత సామరస్యానికి ప్రతీక పీర్ల పండుగ

- Advertisement -
- Advertisement -

పెబ్బేరు : మత సామరస్యానికి ప్రతీక పీర్ల పండుగ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు మండల పర్యటనలో భాగంగా పట్టణంలోని పీర్ల మసీదును సందర్శించారు. మసీదు నిర్మాణం చేపట్టి సంవత్సరాలు గడిచాయని, నూతన నిర్మాణం చేపట్టాలని కోరగా, గోడలు బాగానే ఉన్నాయని పైకప్పు నిర్మాణం చేపడితే సరిపోతుందని మంత్రి అన్నారు. నిర్మాణానికి కావాల్సిన నిధులను మంజూరు చేయిస్తానని హామి ఇచ్చారు.

అనంతరం పీర్ల పేర్లు అడిగి తెలుసుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ గౌని బుచ్చారెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ కోదండ రాంరెడ్డి, వార్డు కౌన్సిలర్ మేకల సుమతి ఎల్లయ్య, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు, నాయకులు దిలీప్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఎండి షబ్బీర్, కుమ్మరి రాజు, కుమ్మరి రాముడు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News