Tuesday, December 24, 2024

వైసిపి షాక్.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే రాజీనామా

- Advertisement -
- Advertisement -

వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి బుధవారం రాజీనామా చేశారు. పిఠాపురంలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన దొరబాబు.. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కూటమితో కలిసి పనిచేస్తానని చెప్పారు.

త్వరలో తన భవిష్యత్ ప్రణాళికను తెలియజేస్తానన్న ఆయన.. గత 25 ఏళ్లుగా తనను వెన్నంటి నడిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి స్వలోభాలకు ఆశపడి రాజీనామా చేయలేదన్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేయడం తమకు తెలియదన్నారు. వీలైనంత త్వరలో భవిష్యత్ ప్రణాళికను తెలియజేస్తానని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News