- Advertisement -
నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మంగళవారం ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎంపి ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు సూర్యానారాయణ, పైడి రాకేష్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి పసుపు రైతులు భారీగా తరలివచ్చారు.
నిన్న నిజామాబాద్ ప్రధాన కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పసుపు బోర్డు ఏర్పాటుతో ఎంపీ అర్వింద్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎంపిగా గెలిస్తే.. నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని 2019 ఎన్నికల్లో ఎంపి అరవింద్ ఇచ్చిన మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.
- Advertisement -