Monday, January 20, 2025

పీయూష్ వర్సెస్ వేముల

- Advertisement -
- Advertisement -

ధాన్యం కొనుగోళ్ల అంశంపై భేటీలో పరస్పర పంచ్‌లు

మీరెలాగు కేంద్రంలో అధికారంలోకి వస్తారు కదా
అప్పుడు విధానాన్ని మార్చుకోండి: గోయల్ వెటకారం

దేవుడు దయతలిస్తే కేంద్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తాం, బిజెపి కూడా ఇద్దరితో మొదలై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా?: ప్రశాంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర మంత్రి పీయూ ష్ గోయల్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. గురువారం ధాన్యం కొనుగోళ్ల అంశంపై జరిగిన భేటీలో పీయూష్ గోయల్, మం త్రి ప్రశాంత్ రెడ్డికి ఈ సంఘటన జరిగిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ వర్గాలు తెలిపిన ప్రకా రం వివరాలు ఇలా…కేంద్రం ధాన్యం సేకరణ చేయ దని రాష్ట్ర మంత్రులతో గోయల్ తేల్చి చెప్పారు. ఇప్పుడున్న విధానాన్ని ప్రజల కోసం మార్చాలని ప్రశాంత్ రెడ్డి కోరగా, దీనిపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ ‘మీరు ఎలాగూ కేంద్రంలోకి అధికారంలోకి వస్తారు కదా అప్పుడు మార్చండంటూ’ కేంద్రమం త్రి పీయూష్ వ్యంగ్యంగా మాట్లాడారు.

ఆ వెంటనే మంత్రి ప్రశాంత్‌రెడ్డి భగవంతుడు దయతలిస్తే తప్పకుండా కేంద్రంలో అధికారం ఏర్పాటు చేస్తామని ధీమాగా బదులిచ్చారు. బిజెపి కూడా ఇద్దరితో మొ దలై ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వచ్చిందని ప్ర శాంత్‌రెడ్డి కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. ఈ క్ర మంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని భేటీకి పిలిచిన కేంద్ర మంత్రి గోయల్ 15 నిమిషాల పాటు సమావేశాన్ని నిలిపివేశారు. కిషన్ రెడ్డి రాకపోవడంతో మళ్లీ భేటీ కొనసాగించారు. బయట దుకాణంలో ఏదీ అమ్ముడు పోతుందో అదే కొంటామని కేంద్రమంత్రి వారితో పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బిజెపి నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎంపిలు చేసిన వ్యాఖ్యల వీడియోలను కేంద్రమంత్రికి ప్రశాంత్ రెడ్డి చూపించారు. పంజాబ్ లో సేకరించిన విధంగా తెలంగాణలో ఎందుకు సేకరణ చేయరని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ చేయమని బియ్యం మాత్రమే తీసుకుంటామని పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News