న్యూయార్క్ : కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కాలిఫోర్నియాలోని టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అయితే అ నారోగ్యం కారణంగా కంపెనీ యజమాని ఎలోన్ మస్క్ ఈ సమయానికి హాజరుకాలేదు. దీనిపై మస్క్ ఎక్స్ పో స్ట్‌లో స్పందిస్తూ, ‘మీరు టెస్లాలో ఉండ టం ఒక గౌరవం. నేను ఈ రోజు కాలిఫోర్నియాకు రాలేకపోయినందుకు చింతిస్తున్నాను, కానీ భవిష్యత్ తేదీలో కలవాలని ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు. గోయల్ మాట్లాడుతూ ఎలోన్ మస్క్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.
టెస్లా తయారీ కేంద్రం వద్ద పీ యూష్ గోయల్ కారు గురించి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో పీయూష్ గోయల్ ఇక్కడ పనిచేస్తున్న భారతీయ ఇంజనీర్లతో సమావేశమయ్యారు. భారతీయ ఇంజనీర్లు ఇక్కడ పని చేయడం చాలా సంతోషంగా ఉందని గోయల్ అన్నారు. ఇటీవల వార్తా సంస్థ రాయిటర్స్ కథనంలో, మస్క్, గోయల్ మధ్య సమావేశం జరిగిందని, భారతదేశంలో ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని టెస్లా ప్రణాళికతో ఉందని పేర్కొంది.
దీంతో పాటు చార్జింగ్ మౌ లిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై కూడా చర్చించవచ్చు. భారత్‌లో రూపొందుతున్న కొత్త విధానాలపై కూడా సమావేశంలో చర్చించవచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఈ విధానంలో ఎలక్ట్రిక్ కార్ల దిగుమతిపై పన్నును 15 శాతానికి తగ్గించే ప్రతిపాదన ఉంది. కంపెనీ భారతదేశంలో తయారీ చేస్తేనే పన్ను తగ్గుతుంది. ప్రస్తుతం ఇది 40,000 డాలర్లు (రూ. 32.5 లక్షలు) కంటే తక్కువ ధర కలిగిన కార్లకు 70 శాతం కస్టమ్ డ్యూటీని, అంతకంటే ఎక్కువ ధర కలిగిన కా ర్లకు 100 శాతం విధిస్తుంది.