Tuesday, November 5, 2024

పంజాబ్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ సాయం తీసుకోనున్న కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

PK

న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సాయాన్ని తీసుకోవాలని కాంగ్రెస్ అనుకుంటోంది. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ‘ఆజ్ తక్’ విలేకరికి తెలిపారు. గతంలో ఎన్నో పార్టీలకు పనిచేసిన ప్రశాంత్ కిశోర్‌ను కాంగ్రెస్ ఉపయోగించుకోవాలనుకుంటున్నటుల తనకు పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ హరీశ్ చౌదరి చెప్పినట్లు కూడా చన్నీ విలేకరికి తెలిపారు. ఇంకా దీనికి సంబంధించిన ఆదేశం పార్టీ అధిష్ఠానం అందిందని కూడా చన్నీ ఆజ్‌తక్‌కు తెలిపారు.

ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. కాగా ఆయన ఇటీవల తాను ప్రజా జీవితం నుంచి విరామం తీసుకోవాలనుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. కిశోర్ కారణంగానే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్‌లో గణనీయమైన విజయాన్ని సాధించింది. ప్రశాంత్ కిశోర్‌ను ప్రధాన సలహాదారుగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను నియమించారు. కానీ ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. కిశోర్‌ను రాజకీయ వర్గాల్లో తరచూ ‘పికె’ అని కూడా పిలుస్తుంటారు. పంజాబ్‌లో ఆయన 2017లో కాంగ్రెస్ కోసం అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశారు. పార్టీ గెలిచాక ‘పికె, ఆయన బృందం పరిశ్రమే పంజాబ్‌లో మా పార్టీ విజయానికి కీలకం’ అని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్ కూడా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News