Tuesday, November 5, 2024

కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు

- Advertisement -
- Advertisement -

Place for cricket in Commonwealth Games

లండన్: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా వచ్చే ఏడాది జరుగనున్న కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు కల్పించారు. మహిళల ట్వంటీ20 విభాగంలో పోటీలు నిర్వహించేందుకు కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కమిటీ అంగీకరించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది జులై 29 నుంచి ఆగస్టు 7 వరకు క్రీడల్లో భాగంగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తారు. ఈ క్రీడల్లో మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడుతాయి. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నాటికి ఐసిసి మహిళల టి20 ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన రెండు బెర్త్‌ల కోసం అర్హత పోటీలు నిర్వహిస్తారు. ఇదిలావుండగా గతంలో కూడా కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు కల్పించారు. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల విభాగంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఆ తర్వాత క్రికెట్‌కు ఈ క్రీడల్లో చోటు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ మళ్లీ కామన్వెల్త్ క్రీడల్లో దర్శనం ఇవ్వనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News