- ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు
మక్తల్: మండల కేంద్రంలో రాబోయే ఎలక్షన్స్, గణేష్ పండుగ సందర్భంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ , పోలీసులతో సుమారు 100 మందితో ప్రజలకు భద్రత భరోసా కల్పించడానికి రూట్ మార్చ్‌ను పోలీసు స్టేషన్ నుండి జిల్లా ఎస్పీ ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ నుండి ఆజాద్‌నగర్ చౌరస్తా మీదుగా షరిఫా మసీద్ , యాదవ్‌నగర్, జమ మసీదు, నల్లజానమ్మ టెంపుల్, నారాయణపేట ఎక్స్ రోడ్ చౌరస్తా, పడమటి ఆంజనేయస్వామి దేవాలయం ముందు నుండి పోలీస్ స్టేషన్ వరకు రూట్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నారాయణపేట జిల్లా కమ్యూనటీ సెన్సిటివ్ జిల్లా రాబోయే ఎలక్షన్స్ వివిధ పండుగలు ఉన్నందున జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు భధ్రత భరోసా కల్పించడానికి వీధులలో రూట్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కె. సత్యనారాయణ, ఆర్‌ఏఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాహుల్, సిఐలు రాంలాల్, రాబిన్ బాబు, సూరజ్, ఎస్‌ఐ పర్వతాలు, ఆర్‌ఏఎఫ్ ఫోర్స్, పోలీసు సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.