Monday, March 17, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లాన్స్ అమలు చేస్తాం… కానీ చెప్పలేం: రోహిత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం చాలా ఆనందంగా ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఇప్పుడు సిరీస్‌లో విజయం సాధించినప్పటికి కొన్ని విషయాల్లో మెరుగు పడాలన్నారు. జట్టులో ప్రతి ఒక్కరూ నిలకడమైన ప్రదర్శన చేస్తున్నారన్నారు. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించామని పేర్కొన్నారు. యువ క్రికెటర్లు తమ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని కొనియాడారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు ఆటగాళ్లు ఫామ్‌లోకి రావడం కలిసి వచ్చిందని రోహిత్ సంతోషం వ్యక్తం చేశారు. గత వన్డే ప్రపంచ కప్‌లో ఆడిన మాదిరిగానే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతామని స్పష్టం చేశారు. ఛాంపియన్ ట్రోఫీలో అమలు చేయబోయే ఫ్లాన్ ఇక్కడి చెప్పలేమన్నారు. కొన్ని సార్లు మనం అనుకున్నా ఫలితాలు రాకపోవడంతో వాటి నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటున్నామని రోహిత్ తెలియజేశారు. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది. అలాగే టి20 సిరీస్ ను కూడా టీమిండియానే దక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News