Thursday, January 23, 2025

క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ సుందరీకరణకు ప్రణాళిక

- Advertisement -
- Advertisement -

రామకృష్ణాపూర్: క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ సుందరీకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బుధవారం ఆయన క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో శ్రీనివాస్ గార్డెన్ నుండి గాంధారి వనం వరకు రహదారిని విస్తృత పరిచేందుకు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.

అందులో భాగంగా శ్రీనివాస్ గార్డెన్ నుండి గాంధారి వనం వరకు 22 కోట్లతో నూతనంగా నిర్మించనున్న నాలుగు లైన్ల ప్రధాన రహదారి, సెంట్రల్ లైటింగ్ పనులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గాంధారి వనంలో సుమారు పది కోట్లతో ఏర్పాటు చేయనున్న శిల్పారామంకు సంబంధించి స్థల పరిశీలన చేశారు.

ఆయన మాట్లాడుతూ త్వరలోనే 16 కోట్లతో రామకృష్ణాపూర్ పట్టణంలో అంతర్గత రోడ్డు నిర్మిస్తామన్నారు. ఆసిఫాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీకి 25 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సాగర్‌రెడ్డి, కౌన్సిలర్లు జాడి శ్రీనివాస్, పారుపెల్లి తిరుపతి, అనిల్‌రావు, అలుగుల శ్రీలత, రెవెల్లి ఓదెలు, బిఆర్‌ఎస్ పట్టణ అద్యక్షుడు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News