Monday, December 23, 2024

మినీ అంగన్‌వాడీ కేంద్రాలకు ప్లాన్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో, జిల్లాలో మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఐసిడిఎస్ అధికారులు పేర్కొంటున్నారు. ఏడాది కితం నిర్ణయం తీసుకోగా ఆగస్టులో 742 సెంటర్లు ప్రారంభించేందుకు సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కేంద్రాలకు చిన్నారుల సంఖ్య పెరుగుతుండటంతో విధులు నిర్వహించే సిబ్బందికి భారం పడకుండా మినీ సెంటర్లు ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో నూతన మినీ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు చేస్తే మొత్తం కేంద్రాల సంఖ్య 36,442 కు చేరుకుంటుందని మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రాజెక్టు అధికారులు కొత్త కేంద్రాలు ఎక్కడెక్కడ నెలకొల్పాలో అంశాలపై ఇప్పటికే స్దలాలను ఎంపిక చేసి జాబితా ఉన్నతాధికారులకు పంపించామని ఆగస్టులో ప్రారంభించనున్నట్లు, అందుకు సంబంధించిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను కూడా నియమించనున్నట్లు తెలిపారు.

నూతనంగా ఏర్పాటు చేయనున్న అంగన్‌వాడీ కేంద్రాలతో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సకాలంలో పౌష్టికాహారం అందడంతో పాటు, మాతా శిశు మరణాలు తగ్గనున్నాయి. ప్రస్తుత లబ్దిదారులు కిలోమీటర్ల మేర కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా పోతుంది. కొత్త సెంటర్ల ఏర్పాటుతో 33 జిల్లాల పరిధిలో 1484 మంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 149 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 35,700 కేంద్రాల్లో 67411 మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 19.07 లక్షల మంది లబ్దిదారులకు సేవలందిస్తున్నారు. ఈ సేవలు పిల్లలు పుట్టినప్పటి నుంచి ఆరు సంవత్సరాల వరకు, కౌమార దశ బాలికలు, గర్భి ణీలు, పాలిచ్చే తల్లులకు ఆహారం, సూక్ష్మ పోషకాల సరఫరా పంపిణీతో పాటు బాల్యంలో విద్య , శిక్షణ సేవలు అందుతున్నాయి. అదే విధంగా ఆరోగ్యం రంగంలో డిసెంబర్ 22 వరకు 2.75 లక్షల మహిళలకు అమ్మబడి, 1.90 లక్షల గర్భిణీ కెసిర్ పోషకాహార కిట్టు లబ్దిదారులకు అందజేస్తున్నారు. వీటితో పాటు లబ్దిదారుల సమూహాలకు అందించే ఆరోగ్యం వివిధ రకాల పోషకాహారం గురించి వివరించడం జరుగుంది. ఇందులో ఆరోగ్య పోషకాహారానికి సంబంధించిన సూచికలు, సాధించిన అంశాలను ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు సమీక్షిస్తారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతి నెల లబ్దిదారులకు పాలు, గ్రుడ్లు 25 నుండి 30 రోజులకు పెంచింది. పప్పులు ఆకుకూరలు 25 రోజులకు, 200 మి.లీ. పాలు, ఒక గ్రుడ్డు 30 రోజులకు ప్రతి నెల అందిస్తున్నారు. వీటితో పాటు గర్భిణీలకు ఐరన్ ఫోలిక్ టాబ్లెట్లు 100 రోజులకు అందిస్తారు. గర్భంతో ఉన్న మహిళలకు బోజనంతో పాటు ఐరన్ పోలిక్ ఆసిడ్‌ను ప్రతి రోజు అందిస్తున్నారు. ఈటాబ్లెట్లను అప్పటికప్పుడు తీసుకునే విధంగా ఏర్పాటు చేయడంతో మరిచిపోయే అవకాశం ఉండదు. ప్రత్యేక రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు రెండింతలు వేతనాలు పెరిగాయని, సిఎం కెసిఆర్ అధికారం చేపట్టిన తరువాత అంగన్‌వాడీ కేంద్రాలు బలోపేతం కావడంతో ఖాళీలు భర్తీ చేసే నోటిఫికేషన్ విడుదలైతే టీచర్లుగా, ఆయాలుగా పనిచేసేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు పోటీపడుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. గతంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేయాలంటే బస్తీలు తిరిగి టీచర్లను ఎంపిక చేయాల్సి పరిస్దితి ఉండేది. త్వరలో కొత్తగా ఏర్పాటు చేసే మినీ కేంద్రాల్లో విధులు నిర్వహించే స్దానిక మహిళలు రాజకీయ నేతలతో పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News