Monday, December 23, 2024

జోషిమఠ్ పునరుద్ధరణకు ప్రణాళిక

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ నగరం పునరుద్ధరణకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. కుంగిపోయిన జోషిమఠ్ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సమావేశమయ్యారు. ఇప్పటికీ జోషిమఠ్ నగరంలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ భయంకరమైన విపత్తును ఎదుర్కోవడానికి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జోషిమత్ కోసం రూ. 1658.17 కోట్లతో పునరుద్ధరణ, పునర్నిర్మాణం ప్రణాళికను ఆమోదించింది. ఈ పథకం కింద, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి పునరుద్ధరణ, పునర్నిర్మాణ విండో నుంచి రూ. 1079.96 కోట్ల కేంద్ర సహాయం అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.126.41 కోట్లు, రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ. 451.80 కోట్లను ఉపశమనం కోసం అందిస్తుంది. ఇందులో పునరావాసం కోసం రూ. 91.82 కోట్ల భూ సేకరణ ఖర్చు కూడా ఉంది. జోషిమఠ్ నగరం బద్రీనాథ్ ధామ్, పూల లోయ, హేమ్‌కుండ్ సాహిబ్‌లకు ఒక ముఖ్యమైన స్టాప్. యాత్రా సీజన్‌కు ముందు జోషిమఠ్‌లో కొండచరియలు విరిగిపడడం, ఇళ్లకు పగుళ్లు రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అప్పుడు బద్రీనాథ్ ధామ్, హేమకుండ్ సాహిబ్ తీర్థయాత్రపై కష్టాల మేఘా లు కమ్ముకున్నాయి. అయితే యాత్రా కాలం ప్రారంభం కాకముందే పగుళ్లు పెరగడం ఆగిపోయి యాత్ర సాఫీగా, సురక్షితంగా పూర్తయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News