న్యూయార్క్: ఒఅమెరికాలోని న్యూయార్క్ ప్రాంతంలో ఆదివారం ఒక శిక్షణ విమానం కూలిపోయి భారత సంతతికి చెందిన ఒక మహిళ మరణించగా ఆమె కుమార్తెతోపాటు విమాన పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. లాంగ్ ఐల్యాండ్‌లోని రిపబ్లిక్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన విమానం ఆకాశంలో మంటల్లో చిక్కుకుందని, నాలుగు సీటర్ల ఈ సింగిల్ ఇంజన్ పైపర్ చెరోకీ విమానం పొలాల్లో కూలిపోగా రోమా గుప్తా అనే 63 ఏళ్ల మహిళ మరణించారు.
ఆమె కుమార్తె 33 ఏళ్ల రీవా గుప్తా మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. విమానం నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న వారికి ప్రాథమిక బోధనగా ఈ విమానంలో విహరింపచేస్తారని డ్యానీ వైజ్‌మ్యాన్ ఫ్లయిట్ స్కూలుకు చెందిన న్యాయవాది ఓలే దెకాజ్లో తెలిపారు. లిండెన్‌బర్ట్‌లోని నివాసం ప్రాంతంలో విమానం కూలిపోయింది. అయితే ఇళ్లపై పడకుండా పంట పొలంలో విమానం కూలిపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పిపోయింది. అక్కడ ఉన్న సిసి కెమెరాలు విమానం కూలిపోయిన దృశ్యాలను బంధించాయి.
Devastated — Ring camera caught the plane crash in Lindenhurst earlier today. pic.twitter.com/GWqGrmCnXF
— Ricky Suave (@rickysuavemusic) March 6, 2023