దక్షిణ కొరియాలోని మువాన్ విమానాశ్రయంలో దుర్ఘటన రన్‌వేపై నుంచి జారి గోడను
ఢీకొట్టిన విమానం ఎగిసిన అగ్నికీలలు.. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ల్యాండింగ్
గేర్‌లో లోపమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు
సియోల్: దక్షిణ కొరియా దేశ చరిత్రలో నే అత్యంత ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 179 మంది దుర్మరణం చెందారు. మరో ఇద్ద రు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిద్ద రూ విమాన సిబ్బంది. మృతుల్లో 83 మంది మహిళలు, 82మంది పురుషులు ఉన్నారు. మరో 11 మృతదేహాలు పూర్తి గా కాలిపోయిన స్థితిలో ఉండడంతో గు ర్తుపట్టడానికి వీల్లేకుండా పోయింది. ఆ దివారం ఉదయం థాయిలాండ్ నుంచి బయల్దేరిన జెజు ఎయిర్‌ఫ్లైట్ 7సి 226 బోయింగ్ శ్రేణికి చెందిన విమానం దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉ. 9.30గంటలకు ల్యాండ్ అవుతూ రన్‌వేపై నుంచి జారి అదుపుతప్పింది. అదే వేగంతో వి మానాశ్రయ ప్రహరీని ఢీకొట్టి ఒక్కసారిగా పేలిపోయింది. విమానంలోని ఇం ధనం కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానాశ్రయ పరిసరాలు దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ పని చే యకపోవడమే ఈ ప్రమాదానికి కారణం గా భావిస్తున్నారు. సహాయక చర్యల కో సం హుటాహుటిన జాతీయ అగ్నిమాప క సంస్థ (ఎన్‌ఎఫ్‌ఎ) సిబ్బంది రంగంలోకి దిగినట్లు దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
బ్యాంకాక్ నుంచి తిరిగి వస్తున్న ఆ విమానం 15 ఏళ్ల నాటి బోయింగ్ 737800 అని, ఉదయం 9.03 గంటలకు ప్రమాదం సంభవించిందని రవాణా మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ప్రమాదం నుంచి బయటపడ్డ విమాన సిబ్బంది స్పృహలోనే ఉన్నారని, ప్రాణాపాయ స్థితిలో లేరని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దుర్ఘటన తరువాత ముగ్గురు వ్యక్తుల జాడ ఇంకా తెలియరాలేదు. అగ్నిజ్వాలల అదుపునకు 32 ఫైర్ ట్రక్కులు, పలు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. దాదాపు 1,560 మంది అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ అధికారులు, సైనికులు, ఇతర అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దక్షిణ కొరియా టెలివిజన్ చానెళ్లు ప్రసారం చేసిన ప్రమాదం ఫుటేజ్‌లో జెజు ఎయిర్ విమానం ల్యాండింగ్ గేర్ ఇంకా మూసుకుపోయిన స్థితిలో అధిక వేగంతో రన్‌వేపై నుంచి జారిపోయి చివర్లో ఉన్న కాంక్రీట్ గోడను ఢీకొనడం, దానితో పేలుడు సంభవించడం కనిపించింది. విమానం పూర్తిగా ధ్వంసం అయిందని, శిథిలాల్లో తోక భాగం మాత్రమే కొద్దిగా కనిపిస్తోందని మయూన్ అగ్నిమాపక కేంద్రం చీఫ్ లీ జియాంగ్‌యోన్ తెలిపారు.
ల్యాండింగ్‌కు ప్రయత్నించి…
జెజు ఎయిర్‌ఫ్లైట్ ల్యాండింగ్ కోసం రెండు సార్లు ప్రయత్నించిట్లు సమాచాం. తొలుత 9గంటలకు లోపాన్ని గుర్తించారు. వెంటనే పైలట్‌కు కంట్రోల్ టవర్ నుంచి సందేశం పంపారు. పక్షి ఢీ కొనడంతో లోపం తలెత్తి ఉంటుందని ల్యాండింగ్‌కు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత పైలట్ ‘మేడే’ హెచ్చరికతో అత్యవసరంగా ఎయిర్‌పోర్టులో దిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే విమానాశ్రయం రన్‌వే చిన్నదిగా ఉండడం కూడా ప్రమాదానికి కారణం అన్న ఆరోపణలను ఎయిర్‌పోర్టు వర్గాలు తోసిపుచ్చాయి. అంతర్జాతీయ విమానశ్రయాలకు తగ్గట్టుగా ఇక్కడ రన్ వే ఉందని స్పష్టం చేశారు.
ప్రమాదానికి అసలు కారణమేంటీ..?
ఈ విమాన ప్రమాదానికి అసలు కారణం ల్యాండింగ్ గేర్లు, టైర్లు పనిచేయకపోవడమా.. లేక మరి ఇంకేదైనా ఉందా అన్నది తేలాల్సి ఉన్నది. ఏదైనా పక్షి ఢీ కొట్టడం వల్లే ల్యాండింగ్ గేర్లు పని చేసి ఉండకపోవచ్చునని అనుమానాలు ఉన్నాయి. ప్రమాదం జరుగుతుండగా విమానం ల్యాండింగ్ గేర్లు వెనక్కే ఉన్నాయని వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. విమాన ప్రమాదానికి జెజు ఎయిర్‌లైన్స్ క్షమాపణ కోరింది. ప్రమాద నివారణకు శాయశక్తులా ప్రయత్నించినట్లు తెలిపింది. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని ఒక ప్రకటనలో వెల్లడించింది. విమాన ప్రమాదంపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విమాన దుర్ఘటపై సమగ్ర విచారణకు ఆదేశించారు.