Saturday, December 21, 2024

జింబాబ్వేలో విమాన ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

జొహెన్స్‌బర్గ్ : జింబాబ్వేలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారత సంతతి వ్యాపారవేత్త , ఆయన కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు. భారత్‌కు చెందిన హర్‌పాల్ రంధావా జింబాబ్వేలో రియోజిమ్ పేరుతో మైనింగ్ కంపెనీ నడుపుతున్నారు. ఈ కంపెనీ బంగారం, బొగ్గును ఉత్పత్తి చేయడంతోపాటు నికెల్, రాగి లోహాలను శుద్ధి చేస్తుంది. శుక్రవారం హర్‌పాల్, ఆయన కుమారుడు మరో నలుగురు సిబ్బందితో కలిసి జింబాబ్వే లోని హరారే నుంచి మురోవా లోని మైనింగ్ ప్రాంతానికి కంపెనీకి చెందిన సెస్నా 206 విమానంలో బయలుదేరారు. విమానం మషావా ప్రాంతానికి చేరుకున్న తరువాత సాంకేతిక లోపంతో కూలిపోయిందని వైమానిక వర్గాలు.

స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో విమానం లోని వారంతా మృతి చెందినట్టు వెల్లడించారు. విమాన ప్రమాద వార్తను రియోజిమ్ కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించింది. ప్రమాదంలో మరణించిన వారి పేర్లను మాత్రం జింబాబ్వే పోలీస్‌లు వెల్లడించలేదు. హర్‌పాల్ స్నేహితుడు, నిర్మాత హోప్‌వెల్ చినోనో ఆయన మృతిని ధ్రువీకరించాడు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తామని రియోజిమ్ ప్రతినిధి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News