- Advertisement -
ఆరుగురు ప్రయాణిస్తున్న ఓ ట్విన్ ఇంజిన్ విమానం శనివారం న్యూయార్క్ ప్రాంతంలోని బురద పొలంలో కూలిపోయిందని అధికారులు తెలిపారు. కొలంబియా కౌంటీ షెరీఫ్ కార్యాలయం మధ్యాహ్నం సమయంలో 911 రిపోర్టుకు స్పందించిందని అండర్ షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ తెలిపారు. ప్రమాదం ప్రాణాంతమని చెప్పినప్పటికీ, ఎంత మంది చనిపోయారన్నది వెల్లడించలేదు. ఆరుగురు వ్యక్తులతో కూడిన మిత్సుబిషి ఎంయు2బి విమానం హడ్సన్ సమీపంలోని కొలంబియా కౌంటీ విమానాశ్రయానికి వెళుతుండగా, కోపాకే సమీపంలో దాదాపు 30 మైళ్ల(18 కిమీ.) దూరంలో కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఇదిలావుండగా ఓ దర్యాప్తు బృందాన్ని మోహరించామని, వారు శనివారం రాత్రికి చేరుకుంటారని జాతీయ రవాణా భద్రతా బోర్డు తెలిపింది.
- Advertisement -