Monday, December 23, 2024

నేపాల్ లో విమానం ప్రమాదం.. సిబ్బందితోపాటు 19మంది మృతి

- Advertisement -
- Advertisement -

నేపాల్ లో విమాన ప్రమాదం జరిగింది. బుధవారం రాజధాని ఖాట్మండు విమానాశ్రయం నుంచి టేకాఫ్‌కు ప్రయత్నిస్తుండగా విమానం రన్‌వే నుంచి జారిపడి కుప్పకూలింది. దీంతో సిబ్బందితోపాటు విమానంలో ఉన్న 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. విమానంలో కొంతమంది సాంకేతిక సిబ్బంది ఉన్నారని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (TIA) సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ హిమాలయన్ వెల్లడించారు.

విమానం కుప్పకూలిన తర్వాత మంటలు చెలరేగి దగ్ధమైంది. విమానం నుంచి పొగలు రావడంతో అగ్నిమాపక సిబ్బంది, భద్రతా సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా..దేశీయ శౌర్య విమానయాన సంస్థకు చెందిన ఈ విమానం నేపాలీ రాజధాని నుంచి రిసార్ట్ పట్టణం పోఖారాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News