Monday, March 17, 2025

విమానం అత్యవసర ల్యాండింగ్.. 73 మంది సేఫ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండిగ్ అయింది. కౌలాలంపూర్ నుంచి వస్తున్న ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ ఎటిసికి సమాచారం అందించారు. దీంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. 73 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా, కొద్ది రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో తృటిలో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. గోవా నుంచి శంషాబాద్ మీదుగా విశాఖపట్నం వెళ్తున్న విమానం ల్యాండింగ్‌కి అనుమతిచ్చారు. కానీ, ఆ విమానం ల్యాండింగ్ అవుతున్న సమయానికి మరో విమానం టేకాఫ్ అవుతుండడాన్ని పైలట్ గమనించి వెంటన విమానాన్ని తిరిగి టేకాఫ్ చేశాడు. దీంతో వెను ప్రమాదం తప్పింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News