Sunday, December 22, 2024

మూడు గంటలు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం… తప్పిన పెనుముప్పు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి  పెనుముప్పు తప్పింది. టేక్ ఆఫ్ అయినా 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో ల్యాండింగ్ కు పైలట్ అనుమతి కోరాడు. విమానంలో ఇంధనం ఎక్కువగా ఉండడంతో మూడు గంటల ఆకాశంలోనే ఎటిసి అధికారులు చక్కర్లు కొట్టించారు. ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర లాండింగ్ కి ఎటిసి అనుమతి ఇచ్చింది. మలేషియా ఎయిర్ లైన్స్ విమానాన్ని సేఫ్ గా లాండింగ్ చేయించడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.  విమానంలో సిబ్బందితోపాటు 130 మంది ప్రయాణికులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News