Sunday, January 19, 2025

జూన్ 3న రాత్రి ఆకాశంలో ఆగు గ్రహాల సమలేఖనం

- Advertisement -
- Advertisement -

ఖగోళ శాస్త్రవేత్తలకు , సందర్శకులకు జూన్ 3 రాత్రి ఆకాశంలో అద్భుత దృశ్యం సాక్షాత్కరించనున్నది. ఆరు గ్రహాలు ఒకే వరుసలో కనిపించే అపురూపమైన సంఘటన సందర్శించే అవకాశం కలుగుతుంది. బుధుడు, అంగారకుడు, గురు (బృహస్పతి) , శని, యురేనస్,నెప్టూన్ తదితర ఆరు గ్రహాలు ఒకే వరుసలో కనిపిస్తాయి. శక్తివంతమైన బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ఉన్నవారు బుధ గ్రహానికి దగ్గరగా ఉండే యురేనస్‌ను, అలాగే శని గ్రహానికి దగ్గరగా ఉండే నెప్టూన్‌ను చూడగలుగుతారు. అమెరికన్లు న్యూయార్క్ రాష్ట్రంలో జూన్ 3 ఉదయం 5 5.26 గంటల సమయంలో సూర్యోదయానికి ముందు ఈ గ్రహాలను చూడగలుగుతారు. ఈ గ్రహాల పెరేడ్ (కవాతు)లో కొంత భాగాన్ని తూర్పు తీరం లోని వివిధ ప్రాంతాలు వేర్వేరు సమయాల్లో చూడగలుగుతాయి. ఉదాహరణకు ఫ్లోరిడా ప్రాంతీయులు శని, అంగారకుడు, బుధుడు, గురుడు గ్రహాలను ఆనాడు ఉదయం 6 గంటల సమయంలో చూడగలరు. ఓహియో ప్రాంతీయులు ఉదయం 5.40 గంటల సమయం లోనే చూడవచ్చు. మీరు వేరే దేశంలో ఉన్నట్టయితే కేవలం రెండు గ్రహాలనే చూడగలుగుతారు.

శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉండడం వల్ల గుర్తించడం అసాధ్యం అవుతుంది. చూడగలిగిన కొన్ని గ్రహాలు మనకు చాలా దూరంగా ఉన్నందున సరిగ్గా కనిపించవు. అయితే గురుడు, అంగారకుడు, శని గ్రహాలు మాత్రం ఉదయం వేళ కొన్ని వారాల పాటు కనిపిస్తాయి. ఈ అద్భుత సంఘటన మిగతా ప్రాంతాల్లో కొన్నిరోజులు మాత్రమే కనిపిస్తుంది. ఆస్ట్రేలియా ప్రజలు మే 28 నాడే ఈ గ్రహాలను చూడగలుగుతారు. మిగతా దేశాల వారు ఈ గ్రహాల పెరేడ్‌ను మే 28జూన్ 6 మధ్య కాలంలో సందర్శించ గలుగుతారు. మే 27న సావోపాలో, 28న సిడ్నీ, 29న మెక్సికో, 30న హాంగ్‌కాంగ్, జూన్ 2న ఏథెన్స్, టోక్యో, జూన్ 3న న్యూయార్క్ ప్రజలు చూడగలుగుతారు. ఈ గ్రహాల్లో గురుడు, అంగారకుడు,బుధుడు, శని గ్రహాలను నేరుగా కంటితో చూడవచ్చు. నెప్టూన్, యురేనస్ లను చూడాలంటే అత్యంత శక్తివంతమైన బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్‌లు అవసరమవుతాయి. సూర్యోదయానికి ముందు ఆకాశం ప్రకాశవంతంగా ఉండడం, భూమికి చాలా దూరంగా అవి ఉండడంతో ప్రత్యేక మైన టెలిస్కోప్‌లు వంటివి ఉంటే తప్ప ఈ గ్రహాలు మొత్తం ఆరింటినీ చూడగలగడం కష్టమౌతుంది. ఇలాంటి అవకాశం మళ్లీ 2492 మే 6 వరకు లభించదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News