Saturday, November 16, 2024

కేంద్రంపై బహుముఖ పోరు

- Advertisement -
- Advertisement -

Economic Times Award for Ease of Doing Business for State

వివక్షపై పక్కా ప్రణాళికతో ఉద్యమాలు

రేపటి కేబినెట్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ దిశానిర్దేశం సుప్రీంకోర్టులో కేసు దాఖలపై విస్తృతంగా చర్చించనున్న మంత్రి మండలి పన్నుల
ఆదాయంలో రాష్ట్రాల వాటా పెంపు కోసం సమరభేరి సెస్, సర్‌ఛార్జీలలో వాటా ఇవ్వని కేంద్రంతో లాడాయి యుద్ధ వ్యూహాలకు మరింత పదును

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయపరమైన ప్రకటనలు, విమర్శలు, చర్చలను పక్కనబెట్టి ప్రభుత్వ పరంగానే అధికారికంగా అన్ని విధాలుగా పోరాటాలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ అధికార గం, మంత్రివర్గాన్ని కూడా సన్నద్ధ్దం చేసేందుకు ఈనెల 11న ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరుగనున్న కేబినెట్ సమావేశంలో అనేక తీర్మానాలు చేయనున్న ట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థ్ధికంగా దెబ్బకొట్టేందుకు కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎండగట్టేందుకు రాజకీయ పరంగానే కాకుండా ప్రభుత్వ పరంగా అధికారికంగా ఉద్యమాలు నిర్వహించేందుకు ఒక పక్కా ప్రణాళికను ఖరారు చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో చర్చలు జరుగనున్నాయని, ఆ మేరకు అజెండాను ఖరారు చేయాలని ఉన్నతాధికారులను సిఎంఓ ఆదేశించినట్లు తెలిసింది.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సి న 34,149 కోట్ల 71 లక్షల రూపాయల బకాయిలను ఇవ్వకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని మంత్రులకు వివరించనున్నారని, ఈ బకాయిలను రా బట్టుకోవడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే అంశాలపై మంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారని, ఇదే అంశంపై కేంద్రానికి వ్యతిరేకంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలో, సుప్రీంకోర్టుకు వెళ్లాలా.. వద్దా? అనే విషయాలను కూడా కూలంకషంగా చర్చిస్తారని ఓ సీనియర్ అధికారి వివరించారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టి 54,970 కోట్ల రూపాయల రుణాలను సేకరించాలని లక్షంగా పెట్టుకొందని, ఈ విషయాన్ని 2022-23వ ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా పొందుపరిచామని, అయినప్పటికీ అర్ధాంతరంగా నిబంధనలు మార్చామనే నెపంతో అప్పులు తెచ్చుకునే వీలు లే కుండా కేంద్రం అడ్డుపుల్లలు వేసిందని, దాంతో రాష్ట్రంలో ఈ ఏడాది జరగాల్సిన అనేక అభివృద్ధి పథకాలకు నిధుల కొరత సమస్య ఏర్పడిందనే అంశాలను కూ డా మంత్రులకు వివరించనున్నారని ఆర్థ్ధికశాఖలోని కొంద రు సీనియర్ అధికారులు వివరించారు.

అప్పులు తెచ్చుకోవడానికి కేంద్రం అడ్డంకులు చెప్పడంతో ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్, మే నెలల్లో సెక్యూరిటీ బాండ్ల వేలం నుంచి సేకరించాలనుకొన్న సుమారు 10,205 కోట్ల రూపాయల నిధులను నష్టపోవాల్సి వచ్చిందని, అంతేగాక అప్పులపైన ఆంక్షలు విధించి 54 వేల కోట్ల రూపాయల్లో సుమారు 19 వేల కోట్ల రూపాయలు కోత విధించిన కేంద్రం ఆర్ధికంగా దెబ్బకొట్టాలని చూస్తుందనే అంశాలను మంత్రులకు వివరించనున్నారు. రాష్ట్రాలు చేసే అప్పులపై సరికొత్త మార్గదర్శకాలను గత ఫిబ్రవరి నెలలో తయారు చేసిన కేంద్రం ఈ తాజా ఉత్తర్వులను గతించిన 2020-21, 2021-22వ ఆ ర్థిక సంవత్సరాలకు కూడా వర్తింపజేస్తూ ఆ వ్యత్యాసాలను చూపించి కొత్త రుణాలపై ఆంక్షలను విధించడం సబబుకాదని, దాని మూలంగా కొన్ని వేల కోట్ల రూపాయలను నష్టపోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుకుంటోందని, తద్వారా తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేటట్లుగా చేసేందుకు కుట్రపూరితంగా కేంద్రం వ్యవహిస్తోందని, దీనిపై జాతీయస్థాయిలోనే కాకుం డా అసెంబ్లీ నియోజకవర్గాల గల్లీగల్లీకి కేంద్రం కుట్రలు తెలిసేలా ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ కేబినెట్ సమావేశంలో చర్చలు జరుగుతాయని వివరించారు.

ఈ కొత్త రూల్సును రద్దు చేసే వరకూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా న్యాయం పోరాటం కూడా చేయాలనే ప్రతిపాదన కూడా ఉందని వివరించారు. దీనికితోడు ప్రధానమంత్రి అధ్యక్షతన ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడానికి దారితీసిన పరిణామాలను కూడా మంత్రులకు వివరించి, నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్రం అమలు చేయకుండా బుట్టదాఖలు చేసిన వైనాన్ని వివరించనున్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని, పన్నుల ఆదాయంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా నిధులను 41 శాతం నుంచి 45 శాతానికి పెంచాలని కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా పోరాటాలు చేయాల్సి ఉందని, అందుకు మంత్రివర్గ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలనే ప్రతిపాదన కూడా ఉందని తెలిపారు. అంతేగాక సెస్, సర్‌చార్జీల పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల నుంచి వసూలు చేసిన సుమారు 15 లక్షల47 వేల 560 కోట్ల రూపాయల నిధుల్లో కూడా రాష్ట్రాలకు వాటా నిధులు ఇవ్వాలని, ఈ విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల మద్దతు కూడగట్టాలని, పన్నుల ఆదాయాల్లో రాష్ట్రాలకూ వాటాలు ఇవ్వాలనే రాజ్యాంగ సూత్రాలు, సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలనే ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని ఆ అధికారులు వివరించారు.

సెస్, సర్‌చార్జీల రూపంలో కేంద్రం దేశ ప్రజల నుంచి వసూలు చేసిన నిధుల్లో రాష్ట్రాలకు 41 శాతం మేరకు వాటా నిధులు ఇచ్చినా కనీసం 8 లక్షల 60 వేల కోట్ల రూపాయలను అన్ని రాష్ట్రాలకూ ఇవ్వాల్సి ఉంటుందని, అందులో తెలంగాణకు 2.102 శాతం నిధులను ఇవ్వాల్సి ఉంటుందని, అంటే ఆ లెక్కన 42 వేల కోట్ల రూపాయలను కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉందని, దీనిపై జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో కేంద్రాన్ని ఎండగట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. అంకెలా గారడీతో రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన 42 శాతం నిధులు రావడంలేదని, ఈ నిధులపై లోతుగా అధ్యయనం చేస్తే రాష్ట్రాలకు కేవలం 29.6 శాతం నిధులు మాత్రమే వస్తున్నాయని, ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక్క తెలంగాణ రాష్ట్రాన్నే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలనూ మోసం చేస్తోందనే అంశాలను సాక్షాధారాలతో సహా అన్ని రాష్ట్రాలకూ సమగ్ర సమాచారాన్ని అందించే ప్రతిపాదన కూడా ఉందని వివరించారు.

కేంద్రం జల్‌జీవన్ పథకం కింద రాష్ట్రంలోని మిషన్ భగీరథ పథకానికి 3922 కోట్ల రూపాయలను కేటాయించిందని, కానీ నిధులను మాత్రం ఈ పథకం నిర్మాణం పూర్తయ్యే వరకూ విడుదల చేయలేదని, పథకం నిర్మాణాలు పూర్తయ్యే చివరి దశలో మాత్రమే 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకునేందుకు వీలుగా నిధుల కేటాయింపులు చేసిన కేంద్రం తొండి చేస్తోందని, వాస్తవానికి మిషన్ భగీరథ పథకానికి సుమారు 42 వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు అయ్యాయని, కాగితాల్లో కేటాయింపులు చూపిస్తూ వాస్తవానికి వచ్చేసరికి నిధులను విడుదల చేయకుండా కేంద్రం దగా చేసిందనే అంశాలను కూడా మంత్రులకు వివరించనున్నారు. ఇలా అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఆర్ధికంగా సహకరించకపోగా, ఆర్ధికంగా దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్న వైనంపై కేబినేట్ సమావేశంలో మంత్రులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసేందుకు ఆర్ధికశాఖాధికారులు కసరత్తులు చేస్తున్నట్లుగా తెలిసింది.

కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, వనరుల సేకరణకు అడ్డంకిగా ఉన్న కేంద్రం రూల్సు, సెస్-సర్‌చార్జీల ఆదాయంలో రాష్ట్రాలకూ వాటాలు ఇవ్వాలనే డిమాండ్లపై మంత్రివర్గ తీర్మానాలు చేసి, ఆ తీర్మానాలను కేంద్రప్రభుత్వానికి పంపించడమే కాకుండా సుప్రీంకోర్టులో కూడా కేసులు పెట్టాలని, ఈ అంశాలపై తెలంగాణ రాష్ట్రంతో కలిసివచ్చే ఇతర రాష్ట్రాలను కూడా కలుపుకొనిపోవాలని, కేంద్రానికి వ్యతిరేకంగా చేయబోయే అధికారిక పోరాటాలు, న్యాయపరమైన పోరాటాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ముందు ఉంటుందని, అందుకు తగినట్లుగా కార్యాచరణ ప్రణాళికను ఈనెల 11వ తేదీన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News