Monday, January 20, 2025

ప్రణాళికాబద్ధంగా ఓటరు జాబితా రూపకల్పన

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : జిల్లాలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా రూపకల్పన ప్రణాళికబద్ధంగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై సమీక్ష సమావేశం 2023 అవగాహన, ఈవిఎంలు, వివి ప్యాట్‌ల ఉపయోగం కోసం డిజిటల్ ఔట్‌రీచ్‌పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ రెండవ విడత ఓటరు జాబితా సవరణలో భాగంగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల ముందు, మనకు వచ్చి ప్రతి దరఖాస్తు స్క్రూటినీ పూర్తి చేయాలని, ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరణ పూర్తి చేయాలని, ఇంటికి 6 కంటే అధికంగా ఉన్న ఓటర్ల వివరాలు ధృవీకరణను పూర్తి చేయాలని తెలిపారు.

ప్రతి జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం రూపొందించిన జిల్లా ఎన్నికల ప్రణాళికను సమర్పించాలని సూచించారు. జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం వారీగా ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంది, అందుబాటులో ఉన్న సిబ్బంది, వారికి శిక్షణ తదితర అంశాలతో సంపూర్ణ సమాచారంతో ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. జిల్లాలో ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు.

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సకాలంలో పరిష్కరించే పకడ్బందీగా ఓటరు డ్రాప్ట్ జాబితా రూపొందిస్తామని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దరఖాస్తు చేసుకొనే సమయంలో ఓటర్లు ఫొటో సరిగ్గా అప్‌లోడ్ చేయకపోవడం, తప్పుడు ఫారంలో దరఖాస్తు చేసుకోవడం వంటి వాటి వలన అధికంగా దరఖాస్తులు తిరస్కరించాల్సి వస్తుందని, ఓటరు దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటే పరిస్థితి మెరగవుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు తప్పుడు ఫారంలో దరఖాస్తు తీసుకున్న నేపథ్యంలో ఎడిట్ చేసే విధంగా అధికారులకు ఆప్షన్ అందించే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News