Wednesday, January 8, 2025

పత్తి కొనుగోళ్లకు ప్రణాళిక

- Advertisement -
- Advertisement -

ప్రతికూల వాతావరణంలోనూ 50లక్షల ఎకరాల్లో సాగు 121మార్కెట్ యార్డుల్లో సిసిఐ కొనుగోలు కేంద్రాలు: నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పత్తి పంట కొనుగోళ్లకు ప్రణాళిక సిద్దం చేయాలని వ్యవాసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హాకా భవన్ లో నిర్వహించిన 2022 పత్తి కొనుగోళ్ల సమీక్షా సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సంబంధిత విభాగాల అధికారులు పత్తి కొనుగోళ్లకు సన్నద్దం కావాలని ఆదేశించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలలో పత్తి సా గు అయ్యిందని తెలిపారు. అననుకూల వాతావరణ పరిస్థితులలోనూ 50 లక్షల ఎకరాలలో సాగు డం గమనార్హం అన్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో పత్తి సరాసరి దిగుబడి తగ్గినా, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ నేపథ్యం లో పత్తికి మంచి ధర లభించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్ లో క్వింటాలు పత్తి ధర సుమారు రూ.8 వేలుగా ఉందన్నారు. రైతులకు మద్దతుధర రూ.6380కు పైగా లభించేవిధంగా మా ర్కెటింగ్ శాఖ, సీసీఐ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రస్తుత ప్రపంచవ్యాప్త పరిస్థితులు చూస్తుంటే రాబోయేకాలంలో పత్తికి మరింత డిమాం డ్ పెరిగే అవకాశం ఉన్నందున రైతులు పత్తి సాగు పెంచే దిశగా అడుగులు వేయాలని సూచించారు. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు పత్తి కొనుగోళ్లలో సంపూర్ణంగా భాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటికే గుర్తించిన 313 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రం లో 121 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో సాఫ్ట్ వేర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, తేమ కొలిచే యంత్రాలు ఏ ర్పాటు చేయాలని, అవసరమైన సిబ్బందిని మార్కెటింగ్ శాఖ వెంటనే నియమించాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వారానికి ఆరు రోజులు పనిచేసే విధంగా సీసీఐ మేనేజర్లు ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. పత్తి కొనుగోళ్లను పరిశీలించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటుకు ఆదేశాలిచ్చా రు. జిన్నింగ్ మిల్లర్లంతా టెండర్లలో విధి గా పాల్గొంటామని సానుకూలత వ్యక్తం చేశారు.

నాణ్యత పరీక్షించడానికి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యం లో ప్రయోగశాల నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. దీనివల్ల రాబోయే కాలంలో నాణ్యతపరంగా రైతులకు మంచి ధరతో పాటు జిన్నింగ్ మిల్లులకు మేలు జరుగుతుందని తెలిపారు. సీసీఐ వద్ద జిన్నింగ్ మిల్లులకు ఉన్న సమస్యలను వెంటనే పరిశీలించాలని సీసీఐకి సూచన చేయ గా, అందుకు సిసిఐ సానుకూలంగా స్పందించింది. పత్తి కొనుగోళ్ల సమీక్షా సమావేశంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు లక్ష్మణుడు, రవికుమార్, సీసీఐ జనరల్ మేనేజర్ అమర్ నాథ్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ మల్లేశం, బ్రాంచ్ మేనేజర్లు బ్రిజేష్ కుమార్ , మహేశ్వర్ రెడ్డి , జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కార్యదర్శి రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News