Monday, January 20, 2025

డెంగ్యూ నివారణకు ముందస్తూ ప్రణాళికలు: మేయర్ గద్వాల్

- Advertisement -
- Advertisement -


మన తెలంగాణ/సిటీ బ్యూరో: డెంగ్యూ వ్యాధి నివారణకు ముందస్తూ ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జిహెచ్‌ఎంసి ఎంటమాలజీ అధికారులను ఆదేశించారు. ప్రపంచ డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మేయర్ క్యాంపు కార్యాలయంలో జిహెచ్‌ఎంసి డెంగ్యూ వ్యాధికి కారణమవుతున్న దోమల కట్టడికి చేపడుతున్న చర్యల పై ఎంటమాలజీ విభాగంఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాలను మేయర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ దోమల వ్యాప్తిని అరికట్టడానికి క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అదేశించారు.

అదే విధంగా దోమల నియంత్రణకు నగరవాసులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. డెంగ్యూ కట్టడికి వర్షాకాలం ప్రారంభం మొదలు రుతుపవనాలు తగ్గే వరకు పూర్తి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. దోమల నియంత్రణకు అందుబాటులో ఉన్న నూతన సాంకేతిక విధానంతో పాటు ఇతర పద్ధతుల ద్వారా సైతం చర్యలు చేపట్టాని అధికారులను అదేశించారు. అదేవిధంగా ఇంటి, బయటి పరిసరాలలో నీటితో నిల్వ వుండే ప్రదేశాలను గుర్తుంచి వారానికి ఒకసారి నీటి నిలువలను శుభ్రం చేసుకోవాలని నగరవాసులకు మేయర్ సూచించారు.

ఇంటి పరిసరాలలో వుండే సిమెంట్ తొట్టెలు, ఓవర్ హెడ్ టాంక్స్, టైర్లు, కూలెర్స్, కొబ్బరి బొండాలు, మనీ ప్లాంట్ బాటిల్స్, మరియు ఫౌంటైన్స్ మొదలగు వాటిలో నీరు వారం కంటే ఎక్కువగా నిల్వ ఉంటే ఎడిస్ లార్వా పెరుగుతుందన్నారు. దీంతో ప్రతి వారానికి ఒక్కసారి వాటిని శుభ్రం చేయడం ద్వారా లార్వాను నిర్వీర్యం అవుతుందని దీంతో చాలమేరకు దోమలవృద్దికి నివారించవచ్చన్నారు. అంతకు ముందు గ్రేటర్‌లో దోమల వృద్దిని అరికట్టేందుకు చేపడుతున్న నివారణ పద్దతులను ఎంటమాలజీ చీఫ్ డాక్టర్ రాంబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎంటమాలజీ రజనీ, ఏ.ఈ రజనీ కాంత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News