Friday, January 10, 2025

సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దే ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ ఆలోచనా సరళికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రా న్ని అద్భుత సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దే ప్రణాళికలు మీ శాఖ నుండే పుట్టుకు రావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రణాళికా శాఖ ఉన్నతాధికారులకు ఉద్బోధించారు. మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ప్రణాళిక శాఖ ని ర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రణాళిక శాఖ అధికారులు నిర్వహిస్తున్న విధులు, తయారు చేసే ప్రణాళికలు, సేకరించే గణాంకాల వివరాలను ఆర్థిక శాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి భట్టి విక్రమార్కకు వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో ప్రణాళిక శాఖ కీలకమన్నారు. ప్రణాళిక శాఖ రూపొందించే ప్రణాళికలు అభివృద్ధికి దిక్సూచి అవుతాయన్నారు. గణాంకాలను ఢాంభికాలకు పోకుండా వాస్తవాలకు దగ్గరగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు ద్వారా సమాజంలో వస్తున్న మార్పులను శాస్త్రీయంగా అంచానా వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అమలు చేసే సంక్షేమ పథకాల సరళిని లెక్కలు కట్టే ప్రణాళిక శాఖ నివేదికలు తయారీలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రజల జీవన స్థితిగతుల్లో వస్తున్న మార్పులు, జీవన ప్రమాణాల పెరుగుదలకు సూచికలు నమోదు చేయడంలో ప్రణాళిక శాఖ కీలక పాత్ర వహిస్తుందన్నారు. ఈ శాఖలో పనిచేసే అధికారులు అంకితభావంతో పనిచేసినపుడే ప్రభుత్వ లక్షాలు నేరవేరుతాయన్నారు. జంటనగరాల్లో 2014 కు ముందున్న చెరువులు, నీటి కుంటలు ఎన్ని ? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి. ఎన్ని చెరువులు అన్యాక్రాంతమయ్యాయి ? ప్రస్తుత చెరువుల పరిస్థితి ఏంటి? అన్న దానిపై ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ జి. దయానందం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన విద్యుత్ ఎంప్లాయిస్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను రాష్ట్ర ఎలక్ట్రిసిటి యూనియన్ 327 ఐఎ న్‌యుసి నాయకులు ఇ .శ్రీధర్, ఎస్ ప్రభాకర్‌లు మంగళవారం మర్యా దపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చాన్ని అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రినికి కలిసిన వారిలో టిఎస్‌ఎస్ పిడిసీఎల్ నుంచి భూపాల్‌రెడ్డి, మెట్రో సిటీ 327 ఛైర్మన్ గోపాల కృష్ణ, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.సీతారాం గోపాల్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News