Tuesday, November 5, 2024

మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

- Advertisement -
- Advertisement -

మంథని: మనిషి తన జీవిత కాలంలో కనీసం 8 చెట్లను పెంచాలని మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత మనంద రిపై ఉందని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. సోమవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవాల సంద ర్భంగా మండలంలోని కుందనపల్లి గ్రామంలోని కన్నాల అటవీబ్లాక్‌లో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యే కోరుకం టి చందర్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.

అనంతరం జిల్లాలో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై రూపొందించిన ఫోటో గ్యాలరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మన జిల్లాలో పరిశ్రమలు, కోల్‌బె ల్ట్ ఉన్నందున మరింత విస్తృతంగా గ్రీన్ కవర్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి, మున్సిపాలిటీలు సమన్వయంతో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ గత 8 విడతల్లో 5 కోట్లకుపైగా మొక్కలు నాటినట్లు తెలిపారు.

మొక్కలు నాటేందుకు మనమే ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసుకున్నారు. మన జిల్లాలో 235 ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలు, 388 ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి విస్తృతంగా మియావాకి పద్దతి ద్వారా మొక్కలు నాటామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో హరితహారం ద్వారా పచ్చదనం గణనీయంగా పెరిగిందన్నారు.

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో పరిశ్రమల వల్ల అధికంగా కాలుష్యం ఉంటుందని, మిగిలిన ప్రాంతాల కంటే ఇక్కడ విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రణాళిక బద్దంగా చేసిన కృషి ఫలితంగా ఎడారిగా ఉన్న ప్రాంతంలో పచ్చదనం వస్తుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో హరిత హారం విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జడ్పీటీసీ ఆముల నారాయణ, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, జిల్లా అటవీశాఖ అధికారి శివయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, ఎఫ్‌ఆర్‌ఓలు నాగయ్య, శ్రీనివాస్‌రావు, విద్యార్థులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పర్యావరణాన్ని అందించాలి
జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ
భవిష్యత్ తరాలకు నివాస యోగ్యమైన పర్యావరణాన్ని అందించాలని దీని కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని సిరిపురం గ్రామంలో పార్వతి బ్యారేజీ వద్ద నీటి పారుదల శాఖ భూమిలో ఏర్పాటు చేస్తున్న సంపద వనాలను కలెక్టర్ ప్రారంభించి మొక్కలు నాటారు.

సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం ఈనటి పారుదల శాఖ పరిధిలోని భూముల్లో మొక్కలు నాటడం, వాటి పెంపకంపై ప్రభుత్వం ప్రత్యేక శద్ద్రవహించి చర్యలు తీసుకుంటుందన్నారు. ఎస్సారెస్పీ కాలువల వెంట, నీటి వనరుల వద్ద గుర్తించిన స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామని అన్నారు.

హరితహారం కింద నాటేందుకు అవసరమైన మొక్కలను మనమే తయారు చేసుకుఏ దిశగా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో హరితహారం ద్వారా పచ్చదనం గణనీయంగా పెరిగిందని, ఇదే స్పూర్తితో భవిష్యత్‌లో సైతం మొక్కలు పెంచడానికి, వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అధికారులు శ్రీధర్, కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత, మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్త శ్రీనివాస్, సర్పంచ్ ప్రసాద్, ఎంపీటీసీ సత్యవతి, ఎంపీడీఓ రమేష్, తహసిల్దార్ ప్రకాష్, ఎంపీఓ హారీఫ్ హుస్సేన్, శ్రీనివాసరావు, ఏపీఎం పద్మ, సీసీ జహంగీర్, విశ్వేశ్వరరావు, శరత్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News