Monday, December 23, 2024

కోల్‌కతా మనిషికి తొలిసారి ‘ప్లాంట్ ఫంగస్’ సోకింది!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే తొలిసారి కోల్‌కతా మనిషికి ‘ప్లాంట్ ఫంగస్’ సోకింది. 61 ఏళ్ల ప్లాంట్ మైకాలజిస్ట్ అయిన ఆయన కోల్‌కతాలోని అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ను సంప్రదించారు. తనకు దగ్గు, బొంగురు గొంతు, నీరసం, మింగడం కష్టం కావడం వంటివి గత మూడు నెలలుగా ఉందని డాక్టర్లకు తెలిపాడు. డాక్టర్లు ఈ విషయాన్ని ‘మెడికల్ మైకాలజీ కేస్’ అనే జర్నల్‌కు తెలిపారు.
వాస్తవానికి అతడికి ఇదివరలో హెచ్‌ఐవి, డయాబెటిస్, వెన్నెముక లేక దీర్ఘ కాలిక వ్యాధులు వంటివి ఏవీ లేవు. కుళ్లిపోతున్న పదార్థాలు, పుట్టగొడుగులు, శిలీంధ్రాలు వంటి వాటిపై అతడు పరిశోధన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడని వైద్యులు తెలిపారు. కాగా అతడి పేరును మాత్రం వ్యక్తం చేయలేదు.

వైద్యులు చీమును తీసి పరీక్ష కోసం నమూనాను ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రం అయిన ఫంగీ రిఫరెన్స్, రీసెర్చ్ సెంటర్‌కు పంపారు’. అక్కడ అతడి వ్యాధిని ‘కొండ్రోస్టెరియం పర్పురియం’గా నిర్ధారించారు. ఇది కార్టిసియాసి కుటుంబానికి చెందిన ఫంగస్ జాతిదని డాక్టర్ షుచిన్ బజాజ్ తెలిపారు. సాధారణంగా దీనిని ‘వైలెట్ ఫంగస్’ అని కూడా పిలుస్తుంటారు. ఇది మానవులకు సంక్రమితం కావడానికి కారణమవుతుంది. యాంటీఫంగల్ ఔషధాల ద్వారా దీనిని నయం చేయవచ్చని డాక్టర్ బజాజ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News