Wednesday, January 22, 2025

గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన తెలంగాణ స్టేట్ బిసి కమిషన్ సభ్యులు

- Advertisement -
- Advertisement -

బర్త్‌డే.. మొక్కలు నాటిన తెలంగాణ స్టేట్ బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర

Plant tree in Green India Challenge
హైదరాబాద్: పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని కర్మాంఘాట్ ఆంజనేయస్వామి టెంపుల్ ప్రాంగణంలో తెలంగాణ స్టేట్ బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మొక్కలు నాటే మంచి కార్యక్రమంతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారో గ్యాలతో ఉండాలని, మంచి వాతావరణం కలిగి ఒమిక్రాన్ వైరస్ తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దేవుడిని ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా విరజిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఇదే విధంగా పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి ప్రకృతి పరిరక్షణ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.నూతన సంవత్సరం సందర్బంగా ఇంత మంచి పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ శ్రేణులు టిఆర్‌ఎస్ వేణు, అజయ్, దిల్‌సుఖ్‌నగర్ విశ్వబ్రాహ్మణ, స్వర్ణకార సంఘం ప్రెసిడెంట్ అనంతచారి, పోచారం నరసింహచారి, బావోజు రవి, చొల్లేటి శ్రీనివాస్, సంతోష్, ఎఫ్‌సిసి ప్రెసిడెంట్ మనోహర్ చారి, తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన హీరో సినిమా బృందం

మనుషులకి, మొక్కలకు మధ్య ఉన్న సంబంధానికి ప్రతీక ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అని యంగ్ హీరో అశోక్ గల్లా అభిప్రాయపడ్డారు. ఆయన హీరోగా నటించిన ‘హీరో’ సినిమా విడుదలవుతున్న సందర్భంగా జూబ్లీహిల్స్, ప్రశాసన్‌నగర్, జిహెచ్‌ఎంసి పార్క్‌లో కథానాయిక నిధి అగర్వాల్, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం వల్ల ఇప్పటికే ఈ భూమిపై అనేక విపత్తులు సంభవిస్తున్నాయని, అది ఆగాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని ఆయన సూచించారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లాంటి కార్యక్రమాన్ని రూపొందించి, ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి కృషి మరింత ముందుకు సాగాలంటే విధిగా ప్రతి ఒక్కరూ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగం కావాలని, విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కో ఫౌండర్ రాఘవ పాల్గొని వృక్షవేదం పుస్తకాన్ని సినిమా బృందానికి అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News