Wednesday, January 22, 2025

నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్: హరితహారంలో నాటిన మొక్కలను కాపాడుకొని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం తెలంగా ణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీ శాఖ ఏర్పాటుచేసిన తెలంగాణ హరితోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థినిలు పాల్గొని వేయి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు రామ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఆర్డిఓ విజయకుమారి, ధారూర్ మార్కె ట్ కమిటీ చైర్మన్ సంతోష్ కుమార్, ప్రజా ప్రతినిధులు, అధికారులు నాయకులతో కలిసి శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో సమతుల్యత వాతావరణం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం హరిత కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

నీరు, ఆహారం లేకుండా కొంతకాలం బ్రతకవచ్చని గాలి లేకుండా నిమిషాల్లో చనిపోతామని తెలియజేస్తూ స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించేందుకు అటవీ సంపద ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. వికారాబాద్ అనంతగిరి అటవీ ప్రాంతంలో ఎన్నో ఔషధ మొక్కలు ఉండడం వల్ల మనకు ఎంతగానో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 10 శాతం గ్రీన్ బడ్జెట్ కేటాయించి పచ్చదనానికి తోడ్పాటు అందిస్తుందని ఆయన అన్నారు. హరితహారం కింద మున్సిపాలిటీ, గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో పెడుతున్న చెట్లను కూడా కాపాడుకోవాల్సి న బాధ్యత మనందరిపై ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

హరితహారం కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనుల నేపద్యంలో హైదరాబాద్ నగరానికి గ్రీన్ సిటీ అవార్డు రావడం జరిగిందని శాసనసభ్యులు మెతుకు ఆనంద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. భూమిమీద జీవరాశి మనుగడకు ఆధారం అటవీ సంపద అని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్ తరాలకు మంచి అనుకూల వాతావరణాన్ని కల్పించే దిశగా హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు పెంచడంతోపాటు వాటిని సంరక్షించుకోవడానికి ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. సమయాలకనుగుణంగా వాతావరణ సమతుల్యంగా ఉండేందుకు, నీటిని ఓడిసిపట్టే విధంగా కందకాలను తీసేందుకు చర్య లు తీసుకుంటూనే, అటవీ సంపద అగ్నిపాలు కాకుండా పైర్ లైన్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఇలాంటి జాగ్రత్త వల్ల అటవీ విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుందని, అటవీ సంపదను కాపాడుకునేందుకు కృషి చేస్తున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనీయులని ఆయన అన్నారు. హరితహారం ప్రాముఖ్యతను గుర్తించి, జిల్లా లో సుమారు 40 లక్షల మొక్కలు పెంచడంతోపాటు వాటిని కా పాడే దిశగా ప్రజలు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అటవీశాఖ నర్సరీల నిర్వహణలో మెరుగైన సేవలు అందిస్తున్న వన సేవకులు (వాచర్స్) రాములు, చం ద్రకాంత్, ప్రభాకర్, శంకరయ్య, మొగులయ్య, వెంకటయ్యలను అతిథులు సన్మానం చేసి మెమొంటోళ్లను అందజేశారు. అదేవిధం గా పర్యావరణ పరిరక్షణపై వ్యాసరచన పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన కేజీబీవీ, బృంగి పాఠశాలల బాలికలు హర్షిత, భార్గవి, శ్రీవల్లి , సుచిత్ర, మోసిని, మిత్రా, లాస్యలకు అతిథులు బహుమతులు అందజేశారు.

కలెక్టరేట్ ఆవరణలో హరితహారం తెలంగాణ హరితోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి అమరేందర్, మిషన్ భగీరథ బాబు శ్రీనివాస్, సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ ఏడి రామిరెడ్డి, అధికారి కోటాజి, డీఎస్సీడీవో మల్లేశం, మైనార్టీ సంక్షేమ అధికారి సుధారాణి, ఇరిగేషన్ ఇఇ హెప్సీనాథ్, మెప్మా పీడీ రవికుమార్, సిపిఓ నిరంజన్ రావు లతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News