Monday, January 20, 2025

మొక్కలు నాటడం అందరి బాధ్యత : నందా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : విరివిగా మొక్కలు నాటి వాటిని ఎదిగే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని షార్ట్ ఫిలిం నటుడు ఆర్ ఎస్ నందా కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా శనివారం కరీంనగర్ జిల్లాలోని వెలిచాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ‘జనానందమే సదానందం.. మీ ఆర్ ఎస్ నందా’ అనే నినాదంతో కామెడీ షార్ట్ ఫిలిం స్టార్ట్ నందా సుపరిచితులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ స్ఫూర్తితో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం అన్నారు. ఇలాంటి కార్యక్రమంలో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొక్క త్యాగం చాలా గొప్పది.. అది బ్రతికున్నా లేకున్నా రెండు రకాలుగా ఉపయోగపడే త్యాగమూర్తి, అలాంటి మొక్కను పెంచి చెట్టుగా పెద్దా చేస్తే అది నీడనిస్తుందన్నారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. పర్యావరణ పరిపరిరక్షణకు తోడ్పడుతుంది.. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ విరివిగా మొక్కలు నాటి వాటిని ఎదిగే బాధ్యత తీసుకోవాలని నందా కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News