Monday, December 23, 2024

మొక్కలను పెంచడం ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత

- Advertisement -
- Advertisement -

వనపర్తి : మొక్కలను పెంచడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చూసినప్పుడే కాలుష ్యరహిత సమాజాన్ని భావితరాలకు అందిస్తామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం తెలంగాణ హరితోత్సవం కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని ఫారెస్ట్ ల్యాండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా అదనపు ఎస్పి షాకీర్ హుస్సేన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్లను పెంచడం ప్రభుత్వ బాధ్యతగా చూడకుండా ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా చూసినప్పుడే భావితరాలకు మంచి కాలుష్యరహిత సమాజాన్ని అందిస్తామని, వివిధ ఫ్యాక్టరీల ద్వారా మనుషుల ద్వారా వెలవడే కార్బన్‌డయాక్సైడ్‌లను చెట్లు పీల్చుకుని ఆక్సీజన్‌ను మనకు అందిస్తాయి కాబట్టి చెట్లను పెంచడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే హరితహారం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించడానికి ఎంతో కృషి చేస్తున్నారని, బడ్జెట్‌లో పది శాతం నిధులను పర్యావరణ పరిరక్షణకు కేటాయిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు.

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ హరితమహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పి నేతృత్వంలో నిర్వహిస్తున్న సమాజానికి కాలుష్య రహిత వాతావరణం అందించడంలో పోలీస్ శాఖ చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకోసం అందరూ మొక్కలు నాటాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ హరితోత్సవం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విస్తృతంగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో దాదాపు 6.5 శాతం అడవుల పెంపకాన్ని పెంపొందించుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్‌ఓ నవీన్ రెడ్డి, జిల్లా జెడ్పి చైర్మెన్ లోకనాథ్ రెడ్డి, డిఎస్పి ఆనంద్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గట్టు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మెన్ వాకిటి శ్రీధర్, టౌన్ ఇన్స్‌పెక్టర్ మహేశ్వర్, ఎస్సైలు యుగంధర్ రెడ్డి, రూరల్ ఎస్సై నాగన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News