Monday, December 23, 2024

మానవ మనుగడకు ప్రాణం పోసేది మొక్కలే

- Advertisement -
- Advertisement -
  • మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్ : మానవ మనుగడకు ప్రాణం పోసేది మొక్కలని, మొక్కలు నాటడం కూడా అభివృద్ధిలో భాగమని ప్రగతికి సోపానమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నూతన కలెక్టరేట్ సముదాయంలో చేపట్టిన హరితోత్సవంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా అటవీ శాఖాధికారి రవిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్‌కమిటీ చైర్మన్ బట్టి జగపతి తదితరులతో కలిసి పెద్ద ఎత్తునమాస్ ప్లాంటేషన్‌లో పాల్గొనిమొక్కలు నాటి నీళ్లు పోశారు.అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ శాఖ ముద్రించిన హరితహారం విజయాలుగోడ పత్రికను ఆవిష్కరించారు.

అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ…. అశోక చక్రవరి తర్వాత మొక్కలు నాటించడం, చెరువులు తవ్వకం అనే బృ హత్కర కార్యక్రమాలను సిఎం కెసిఆర్ చేపట్టాడన్నా రు. రోజురోజు కాలుష్యం పెరుగుతుందని, ప ర్యావరణ సమతుల్యానికి మొక్కలు పెంచకపోతే రాబోవు కాలంలో ఆక్సిజన్ దొరకక ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకునే స్థాయి వస్తున్నదని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలను చూసుకున్నట్లయితే ఒక మనిషికి ఆక్సిజన్ తీసుకోవడానికి 30 చెట్లు ఉంటేమన దగ్గర 30 మందికి ఒకచెట్టుకూడా లేదన్నారు.

భవిష్యత్తుతరాలు హాయిగా, ఆరోగ్యంగా జీవించడానికే సిఎం పెద్దఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టి 8వ విడతలో రాష్ట్రంలో 273 కోట్ల మొక్కలు పె ంచడంతోపాటు గ్రీన్ బడ్జెట్ కింద 10శాతం నిధులు ఖర్చు పెడుతున్నారని, అడవుల పునర్జీవనానికి కృషి చేస్తు ండటం వల్ల నేడు 7.7 శాతం పచ్చదనం పెంపొందిందని ఇది దేశ చరిత్రలో రికార్డు అని అ న్నారు. ప్రతిగ్రామపంచాయతీలో నర్సరీలు, పల్లె ప్ర కృతివనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలతో పాటు అర్బన్ పార్కులు, ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ…. భూభాగంలో 33శాతం ఉండవలసిన అడవులు పలు కారణాల రీత్యా క్షీణించగా సిఎం ప్రణాళికబద్దంగా హ రితహారం కార్యక్రమం చేపట్టి 85శాతం మొక్కలు బ్రతికేలా అధికారులు, ప్రజాప్రతినిధులకు బాద్యులను చేశారన్నారు. మానవాళికి జీవనాధారమైన చెట్లనుమనం రక్షిస్తే అవి మనకు నీడను,స్వచ్చమైన గాలి, పూలు, పండ్లు, ఔషదాలు ఇస్తూ రక్షిస్తాయని అన్నారు.

ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ… గతంలో ముఖ్యమంత్రి సిద్దిపేటలో ఒకేరోజు 10వే ల మొక్కలు నాటి పచ్చదనానికి ఇస్తున్న ప్రాముఖ్యతను వివరించాలన్నారు.జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజన్, దార్శనికత, అటవీశాఖ సాంకేతిక మార్గదర్శకాల మేరకు సూ క్ష్మ ప్రణాళికతో పనిచేయడం, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిషఙ్ట బాగస్వామ్యం వల్ల రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించుకున్నామన్నారు. ఇప్పటివరకు 8 విడతలుగా హరితహారం కార్యక్రమం నిర్వహించుకున్నామని, ఈ 9వ విడత కార్యక్రమం లో కూడా ప్రతి ఒక్కరు భాగస్వాములై ప్రతి ఇంటా 6 మొక్కలు పెంచి అన్ని బ్రతికేలా చూడాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నృత్యం చేశారు. పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ జానకిరామ్‌సాగర్, జిల్లా అధికారులు శ్రీనివాస్, రా ధాకిషన్, రాజిరెడ్డి, శంకర్, విజయశేఖర్‌రెడ్డి, విజయలక్ష్మి, సుధాకర్, మెప్మా పిడి ఇందిర, డిసిఓ కరుణ, వ్యవసాయాధికారి ఆశాకుమారి, ఎంపిపి యము, కోఆప్షన్ సభ్యులు మన్సూర్, కౌన్సిలర్లు, విద్యార్థినిలు, అటవీశాఖ సిబ్బందిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News