Wednesday, January 22, 2025

మానవ జీవనానికి మొక్కలు దోహదం

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం సింగరేణి : కొత్తగూడెం ఏరియాలోని జీఎం కార్యాలయంలో స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఈ నెల జూన్16 నుంచి 30వ తేదీ వరకు వివిధ స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏరియా ఇంఛార్స్ జీఎం బి.రవీందర్ తెలిపారు. గురువారం జీఎం కార్యాలయంలో అధికారులందరు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛతా ఆవశ్యకతను తెలిపి, మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీబిజికెఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, ఎస్‌వోటూ జీఎం జివి. కోటిరెడ్డి, ఏజీఎం (ఇఅండ్‌ఎం) వై.రఘురామిరెడ్డి, ఏజీఎం (పర్సనల్) పి.సామ్యుల్ సుధాకర్, డిజీఎం (ఫైనాన్స్)టి. రాజశేఖర్, డిజీఎం సర్వే ఎస్. సదానందం, డిజీఎం ఐడి ఎన్ యోహాన్, ఎన్విరాన్మెంట్ మేనేజర్ టి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News