Wednesday, January 22, 2025

కెటిఆర్ జన్మదినం… 2000 మొక్కలు నాటిన ముఖరా కె గ్రామస్థులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్బంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో ముఖరా కె గ్రామస్థులు 2000 మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్బంగా 2000 మొక్కలు నాటి 100% బ్రతికిస్తామని గ్రామస్థులు ప్రమాణం చేశారు. మంత్రి కెటిఆర్ జన్మదినం పురస్కరించుకొని ప్రతి యేటా గ్రామంలో మొక్కలు నాటుతున్నారు. మంత్రి కెటిఆర్ ప్రతి జన్మదినం సందర్బంగా 2000 మొక్కలు నాటుతున్నారు. ఇప్పటి వరకు మంత్రి కెటిఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని మొత్తం 10,000 మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదు దాని 100% రక్షిస్తామని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో గ్రామంలో ఇప్పటి వరకు 1లక్ష మొక్కలు నాటి 100% రక్షణ ఇచ్చామని సర్పంచ్ గాడ్గే మీనాక్షి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గాడ్గే సుభాష్, ఉపసర్పంచ్ వర్ష, మాదవ, వెంకటి, సంజీవ్ గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News