- Advertisement -
కీసరః పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు విరిగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని గోధుమకుంట, కరీంగూడ సర్పంచులు ఆకిటి మహేందర్‌రెడ్డి, కౌకుట్ల గోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలు వార్డులలో ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు.
ప్రతి ఒక్కరు బాధ్యతగా తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచులు సూచించారు. హరిత గ్రామంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచులు సోమని ఆంజనేయులు, బోడపట్ల మాధవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బి.సురేష్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -