Sunday, January 19, 2025

హెలిప్యాడ్‌పై ప్లాస్టిక్.. యడియూరప్ప హెలికాప్టర్‌కు తప్పిన ముప్పు (వీడియో)

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత బిఎస్. యడియూరప్పకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దిగాల్సిన హెలిప్యాడ్‌పై ప్లాస్టిక్ పేరుకుపోవడంతో, చివరి నిమిషంలో పైలట్ ల్యాండింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం యడియూరప్ప, మరికొంతమంది బీజేపీ నేతలతో కలిసి కలబుర్గి వెళ్లారు. జెవార్గి ప్రాంతంలో వీరి హెలికాప్టర్‌ను దించేందుక స్థానిక అధికారులు హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ హెలిప్యాడ్ పై చెత్తా చెదారం, ప్లాస్టిక్ షీట్లు పేరుకు పోయాయి.

హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు కిందకు రాగానే అవన్నీ ఒక్కసారిగా పైకి ఎగిరి ల్యాండింగ్‌కు ఇబ్బందిగా మారాయి. దీంతో పైలట్ చివరి నిమిషంలో ల్యాండింగ్‌ను రద్దు చేసుకోవడంతో హెలికాప్టర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ తర్వాత స్థానిక యంత్రాంగం హెలిప్యాడ్ ను శుభ్రం చేసి ల్యాండింగ్‌కు వీలు కల్పించారు. అప్పటిదాకా హెలికాప్టర్ అక్కడే గాల్లో చక్కర్లు కొట్టింది. కొంతసేపటి తర్వాత అదే హెలిప్యాడ్‌పై సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News