Saturday, November 23, 2024

రేషన్‌లో ప్లాస్టిక్ బియ్యం

- Advertisement -
- Advertisement -

అమరచింత : మండల పరిధిలోని సింగంపేట గ్రామంలో ప్రభుత్వం నుంచి వస్తున్న రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్య ం రావడంతో ఒక్కసారిగా లబ్ధిదారులు అవాక్కయ్యారు. ఎప్పటిలాగే గ్రామంలో రేషన్ షాప్ నుంచి తీసుకువచ్చిన వారు వంట చేసుకోవడా నికి బియ్యానిన బోగానిలో పోసుకొని నీటిలో కడుగుతుండగా బియ్యం నీళ్లపైకి తేలడంతో అనుమానంతో గ్రామంలోని ప్రజలు ఒకరికొకరు చూయించుకొని అవాక్కైనట్లు గ్రామ ప్రజలు తెలిపారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉన్నత సివిల్ సప్లై అధికారుల నిర్లక్షం వల్ల రేషన్ బి య్యంలో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయన్నారు. అధికారుల నిర్లక్షంతోనే బియ్యంలో ప్లాస్టిక్ బి య్యం కలిసాయని ప్రజలు ఆరోపించారు. వీటి ద్వారా ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదం వా టిల్లే అవకాశం ఉందని, తక్షణమే సంబంధిత అధికారులు సింగంపేట గ్రామ ంలోని రేషన్ బియ్యాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News