Sunday, January 19, 2025

మేడారం జాతరలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ :  మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా మేడారంకు వచ్చే యాత్రికులకు జాతర స్థలంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, మున్సిపల్ ఘన వ్యర్థాలు అలాగే బయోమెడికల్ వ్యర్థాల గురించి అవగాహన కల్పిస్తూ ఆయా డబ్బాల్లోనే వేయాలని చెబుతోంది. పర్యావరణం, ఆరోగ్యం, ప్రజల జీవితంపై కాలుష్య ప్రభావాన్ని పలువురికి వివరిస్తూ ఎక్కడంటే అక్కడ వేయకుండా నిర్దేశించిన డబ్బాల్లో వేసేలా చూస్తోంది. అంతే కాకుండా ఈ మేరకు టిఎస్ పిసిబి ప్రాంతీయ కార్యాలయం వరంగల్ , 6 కళ్యాణకట్ట, వేర్వేరు పాయింట్ల వద్ద ఆయా వ్యర్థాలను సేకరించడానికి పలు ప్రత్యేక డబ్బాలను ఏర్పాటు చేసింది.

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో తలనీలాలను ఇచ్చెే కళ్యాణ కట్ట వద్ద కూడా డబ్బాలను ఏర్పాటు చేసి తలనీలాల సమర్పించిన బ్లేడ్‌లు ఇతర వ్యర్థాలను కూడా సేకరిస్తోంది. ఇలా అక్కడి నుండి సేకరించిన బయోమెడికల్ వ్యర్థాలను పారవేసే చోటికి తరలించనున్నారు. ఇప్పటికే ఈ పనిని చూసే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను పిసిబి ఇటీవలే నిర్వహించింది కూడా. వ్యాధులు వ్యాప్తి చెందకుండా , ప్రజారోగ్యం , పర్యావరణాన్ని పరిరక్షించడానికి పిసిబి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వ్యర్థాలను సరైన పద్ధతిలో సేకరించి పారవేయడంలోనూ సమన్వయం చేస్తున్నామంటున్నారు.

Medaram Jatara 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News