Thursday, January 30, 2025

వేదిక కుప్పకూలి ఏడుగురు మృతి..80మందికి పైగా గాయాలు

- Advertisement -
- Advertisement -

లక్నో: వేదిక కుప్పకూలి ఏడుగురు మృతి చెందిన విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బాగ్‌పత్‌లో మతపరమైన కార్యక్రమం నిర్వహించారు. అయితే, వెదురు చెక్కలతో ఏర్పాటు చేసిన వేదిక ప్రజల బరువుతో ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా..80 మందికి పైగా శిథిలాల క్రింద చిక్కుకుని గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బరౌత్‌లోని జైన్ కమ్యూనిటీ మంగళవారం ‘లడ్డూ మహోత్సవ్’ నిర్వహించింది.  ఈ క్రమంలో వందలాది మంది ప్రజలు లడ్డూను సమర్పించడానికి ఒక ఆలయానికి చేరుకున్నారు. అయితే, భక్తుల కోసం ఏర్పాటు చేసిన వెదురు వేదికపైకి వెళ్లడంతో బరువును మోయలేక అది కూలిపోయింది.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు బాగ్‌పత్ పోలీస్ చీఫ్ అర్పిత్ విజయవర్గియా తెలిపారు. స్వల్ప గాయాలైన వారికి ప్రథమ చికిత్స అందించి ఇంటికి పంపగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News