Wednesday, January 22, 2025

కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధర పెంపు

- Advertisement -
- Advertisement -

Platform ticket price hike at Kacheguda railway station

ప్రయాణికుల వెంట వచ్చే వారిని నియంత్రించడానికే
ధరను పెంచాం: దక్షిణమధ్య రైల్వే

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల వెంట వచ్చే వారిని నియంత్రించడానికి కాచిగూడ రైల్వేస్టేషన్‌లో తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతూ దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల రద్దీతో పాటు వారి వెంట వచ్చే వారు ప్లాట్‌ఫాంలపై ప్రవేశించకుండా ఈనిర్ణయం తీసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. పండుగ నేపథ్యంలో ఏర్పడే రద్దీతో ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని నివారించడానికి, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కాచిగూడ రైల్వేస్టేషన్‌లో నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ప్లాట్‌ఫారం టికెట్టు ధరను రూ.10/ల నుంచి రూ. 20/లకు తాత్కాలికంగా పెంచినట్టు దక్షిణమధ్య రైల్వే శాఖ తెలిపింది. రైల్వే ప్రయాణికులు ఈ మార్పును గమనించి రైల్వేశాఖకు సహకరించాలని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News