Friday, November 15, 2024

ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.30

- Advertisement -
- Advertisement -

Platform ticket price raised from Rs 10 to Rs 30

 

కరోనా వ్యాప్తి కట్టడి పేరుతో రైల్వే శాఖ అనూహ్య నిర్ణయం
పెంపు తాత్కాలికమేనని వివరణ

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రైల్వే శాఖ అనూహ్య నిర్ణయం తీసుకొంది. ప్లాట్‌ఫామ్ టికెట్ల ధరలను భారీగా పెంచుతూ ప్రకటన చేసింది. ఇదివరకు రూ.10గా ఉన్న ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.30కి పెంచింది. దీంతో ఒక్క సారిగా రూ. 20 పెరిగినట్లయింది. అయితే ఈ ధరలను తాత్కాలికంగా మాత్రమే పెంచినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. కరోనావ్యాప్తి కట్టడి తమ బాధ్యత అని పేర్కొన్న రైల్వే శాఖ రైల్వే స్టేషన్లలో జనం గుమిగూడడాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకొన్నట్లు తెలిపింది. ప్లాట్‌ఫామ్ టికెట్ల ధరలపై ఇటీవల సమీక్షించిన రైల్వే బోర్డు శుక్రవారం ఈ నిర్ణయం తీసుకొంది. దీంతో పాటు లోకల్ రైళ్లలో కనీస చార్జీలను కూడా రూ.10నుంచి రూ.30కి పెంచింది.పెంచిన ధరలను వెంటనే అమలులోకి తేవాలని అన్ని రైల్వే జోన్లకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News