Thursday, December 26, 2024

‘మొక్కలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి’

- Advertisement -
- Advertisement -

Player sindhu plant trees in Green India challenge

మన తెలంగాణ/హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరేట్ ఆవరణలో అంతర్జాతీయ టైక్వాండో ప్లేయర్ సింధు తపస్వి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సింధూ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్బంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా మొక్కలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అన్నారు. ఇప్పుడు ఉన్న సమాజంలో మొక్కలు నాటాల్సిన భాద్యత యువత మీద ఎక్కువగా ఉందన్నారు. పుట్టినరోజు సందర్బంగా ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News