Saturday, November 23, 2024

రాహుల్ గాంధీ వేటుపై సుప్రీంకోర్టులో పిటిషన్!

- Advertisement -
- Advertisement -
సెక్షన్ 8(3) స్వయంచాలక అప్పీల్ ప్రకారం రాహుల్ గాంధీ అనర్హత వేటు ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా ఉన్నందున రాజ్యాంగ విరుద్ధంగా ( ultra vires of the Constitution) ప్రకటించాలి.

న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుపై సుప్రీంకోర్టులో నేడు పిటిషన్ దాఖలయింది. ఆటోమేటిక్  అనర్హత వేటును సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలయింది. ఎలాంటిది, తీవ్రత ఎంత, ఎంతటి ఘోర నేరం అనే అంశాల ఆధారంగా తీర్పును సవాలు చేయడం జరిగింది. మలప్పురం సామాజిక కార్యకర్త ఆభా మురళీధరన్ తరఫున అడ్వొకేట్ దీపక్ ప్రకాశ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రజాప్రాతినధ్య చట్టం,1951లోని సెక్షన్ 8(3) ప్రకారం ఆటోమేటిక్ అనర్హత వేటు అంటూ ఏదీ లేదని పేర్కొన్నారు.

ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ‘దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఎందుకు ఉంది?’ అన్నందుకు మార్చి 23న సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చేస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత లోక్‌సభ సచివాలయం శుక్రవారం ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది.

లిలీ థామస్ కేసు(2013)ను పునర్విచారించాల్సి ఉంది. 1951 చట్టంలోని అధ్యాయం 3 కింద అనర్హత వేటును నేర తీవ్రత, సీరియస్‌నెస్‌ను బట్టి వర్గీకరించాల్సి ఉంది. ‘లిలీ థామస్ కేసు ఆపరేషన్లను దుర్వినియోగం చేస్తూ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా కక్షపూరిత విధానంతో ఉపయోగిస్తున్నారు’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
‘లిలీ థామస్ కేసు తీర్పు నుంచి పరువు నష్టంను మినహాయించాలని, లేకుంటే పౌరుల ప్రాతినిధ్య హక్కుపై అది ప్రభావం చూపగలదు’ అని పిటిషనర్ పేర్కొన్నారు.

‘ఆర్టికల్ 19 1(ఎ)(వాక్, భావ ప్రకటన స్వేచ్ఛ) ప్రకారం పార్లమెంటు సభ్యుడికి భావాన్ని ప్రకటించే హక్కు ఉంది. ఐపిసి సెక్షన్లు 499, 500 ప్రకారం అది నేరం అయితే, అది కేవలం సాంకేతికతకు సంబంధించింది. గరిష్ఠ శిక్ష రెండేళ్ల నుంచి దానిని తీసేయాల్సి ఉంది. లిలీ థామస్ తీర్పు ప్రజాప్రాతినిధ్య హక్కు మీద ఘోర ప్రభావం చూపనుంది’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News