Wednesday, January 22, 2025

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని వినతి

- Advertisement -
- Advertisement -
అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసిన సొసైటీ ప్రతినిధులు

హైదరాబాద్ : తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో కృషి చేయాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (డిజెహెచ్‌ఎస్) ప్రతినిధులు కోరారు.  అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని సోసైటీ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, డైరెక్టర్లు దండా రామకృష్ణ, డేగ కుమార్, సలహాదారు విక్రమ్‌రెడ్డి కలిసి విన్నవించారు. డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ గురించి స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. ఇది నూతనంగా ఏర్పాటు అయిన సొసైటీ అని ప్రతినిధులు ఆయనకు వివరించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే విషయంలో స్పీకర్ సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు వినతి పత్రం అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News